పోలియో రహిత సమాజం నిర్మిద్దాం – ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరి..!!

పోలియో రహిత సమాజం నిర్మిద్దాం – ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరి..!!

28/June/2026 20:04    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని ఏఎస్‌ఆర్ కాలనీ సచివాలయం పరిధిలోని రాంనగర్‌లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు లంక ఉదయ్, కొటారు శ్రీను మాస్టర్, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీమంతుల శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం లంక ఉదయ్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే పోలియోను పూర్తిగా నిర్మూలించగలమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, పిల్ల నూకరత్నం మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter