యలమంచిలి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు అధ్యక్షతన మరియు ముఖ్య అతిథులుగా పప్పల చలపతిరావు , రాజాన రమేష్ కుమార్ , ధూళి రంగనాయకులుతో కలిసి యలమంచిలి నియోజకవర్గంలో అత్యంత భారీ ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రగడ నాగేశ్వరావు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం అంటే అది ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలితము అందుచేత ప్రతి ఒక్కరిలో దేశం మీద భక్తి ప్రేమ గౌరవం ఉండే విధంగా ఇలాంటి ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం అని తెలిపారు. ఈ ర్యాలీ యలమంచిలి వీధుల్లో యలమంచిలి నియోజకవర్గంలో గల నాలుగు మండలాల నుండి దాదాపుగా 500 బైకులు 1000 మందికి పైగా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమానికి పట్టణ పార్టీ అధ్యక్షులు గొర్లె. నానాజీ , రూరల్ ప్రెసిడెంట్ సన్యాసి నాయుడు , మునగపాక ప్రెసిడెంట్ విజయ్ , రంగనాయకులు , మేరుకు బాపు నాయుడు, ఏరిపిల్లి. చిట్టి బాబు, మామిడి శివ అప్పారావు, భీమరశెట్టి. శ్రీనివాసరావు, డక్క. నాగభూషణం , కొటార్. సాంబశివరావు, కరణం. రవికుమార్, దాంట్ల. వెంకటస్వామి,కే. ఈశ్వరరావు నాలుగు మండలాల క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, జిఎస్ లు, వార్డ్ ప్రెసిడెంట్లు మరియు జిఎస్ లో, మరియు యలమంచిలి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది.