ప్రజా సేవల్లో జవాబుదారీతనం పెంచాలని కలెక్టర్ ఆదేశం..

ప్రజా సేవల్లో జవాబుదారీతనం పెంచాలని కలెక్టర్ ఆదేశం..

13/August/2026 20:03    Share:   

గౌతమీ హాలులో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్పై సమీక్ష
ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు సంతృప్తికరమైన రీతిలో సేవలు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్)పై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వాటిని ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
రిజిస్ట్రేషన్, ఆర్టీసీ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, అన్నా క్యాంటీన్ల నిర్వహణ, ఐసీడీఎస్, రెవిన్యూ సేవలు, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం, రేషన్ పంపిణీ, మెప్మా, డీఆర్డీఏ, గిరిజన సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలలు, వైద్య ఆరోగ్య శాఖ తదితర ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల్లో అధికారులకు జవాబుదారీతనాన్ని పెంచేందుకు, సేవలు పొందిన ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకుంటున్నదన్నారు.
ప్రజల సంతృప్తి స్థాయి అధికారుల పనితీరుకు కొలమానమని, తక్కువ సంతృప్తి స్థాయిలో ఉన్న శాఖల అధికారులు తమ శాఖల సేవల్లో లోపాలను గుర్తించి పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. లబ్ధిదారులు తమ అభిప్రాయాలను తెలియజేయడంలో అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, డీఎఫ్ఓ పీ.వీ. సందీప్ రెడ్డి, డీఆర్ఓ ఎం. శ్రీదేవి, జిల్లాపరిషత్ సీఈఓ జగదాంబ, డీపీఓ మల్లికార్జునరావు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డీఎంహెచ్ఓ డా.శోభ, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ట్రాన్స్కో ఎస్ఈ అంబేద్కర్, డ్వామా పీడీ కే.వీ. సుబ్బారావు, సీపీఓ శ్రీనివాసరావు, ఆర్టీసీ ఆర్ఎం షబ్నమ్ తదితర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter