"మంచి మార్గంలో శక్తిని వినియోగిస్తేనే ఉత్తమ నాయకులవుతారు" - న్యాయమూర్తి రమేష్
యలమంచిలి, ఆగస్టు 12: అంతర్జాతీయ యూత్ డే సందర్భంగా యలమంచిలి తులసి నగర్లోని శ్రీ గౌరీ విద్యా నికేతన్ హై స్కూల్ బ్లాక్లో యలమంచిలి అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ కె. రమేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి రమేష్ మాట్లాడుతూ, యువత తమ శక్తిని మంచి మార్గంలో నడిపిస్తే భవిష్యత్తులో వారే అత్యుత్తమ నాయకులు అవుతారని తెలిపారు. విద్యార్థులు తమ ప్రతిభను సద్వినియోగం చేసుకోవాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా తమ జీవిత గమ్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ గారు, ద్వారపురెడ్డి వెంకట్రావు గారు, కూనిశెట్టి శ్రీనివాస్ గారు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు మరియు న్యాయవాదులు విద్యార్థులే దేశానికి వెన్నుముక అని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన వారికి న్యాయమూర్తి రమేష్ గారు మెడల్స్ బహుకరించారు. స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దలు చెప్పిన విషయాలను విద్యార్థులు అత్యంత శ్రద్ధగా విన్నారు.