తల్లి బిడ్డల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట- ఎమ్మెల్యే బడేటి చంటి

తల్లి బిడ్డల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట- ఎమ్మెల్యే బడేటి చంటి

12/August/2026 20:18    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
తల్లులు, నవజాత శిశువులకు మరింత మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించే ఉద్దేశంలో భాగంగా ఏర్పాటు చేసిన 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాన్ని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ, తల్లి మరియు బిడ్డ ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ , బాలింతలు, నవజాత శిశువులు వైద్య సేవల అనంతరం సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రవణ్ కుమార్,గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శ్యామలాదేవి,DCHS డాక్టర్ కమలా,జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శోభ,  జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బేబీ కమల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter