కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నేతలు
ఎలమంచిలి:
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు పడాల వారి వీధిలో ఈరోజు 'ఇంటింటా తెలుగుదేశం' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎలమంచిలి టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు గొర్లె శివన్నారాయణ (నానాజీ), క్లస్టర్ ఇంచార్జ్ బొద్దపు శ్రీనివాసరావు, కరణం రవికుమార్, యూత్ అధ్యక్షులు నమ్మి రమణ, వార్డు ఇంచార్జ్ శ్రీమంతుడు శ్రీనివాసరావు, సెక్రటరీ పడాల చందర్రావు తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.