అనకాపల్లి: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అనకాపల్లి రైల్వే స్టేషన్, లక్ష్మీదేవిపేట వద్ద రైలు ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ, పార్లమెంట్ సభ్యులు శ్రీ సిఎం రమేష్ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ పీలా గోవింద్ సత్యనారాయణతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులు సూచించారు.
గతంలో సుమారు రూ.47 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.90 కోట్లకు చేరిందని, రైల్వే శాఖ అవసరమైన నిధులు కేటాయించి పనులను పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు. ఇప్పటికే సర్వే పూర్తయిందని, భూసేకరణ తదితర ప్రక్రియలు కూడా పూర్తయినట్లు పేర్కొన్నారు.ఆర్ఓబీ నిర్మాణంలో తొలగించాల్సి వస్తున్న దేవాలయాలు చర్చిలకు ప్రత్యామ్నాయ స్థలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన ప్రక్రియలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి, ప్రజలకు వీలైనంత త్వరగా ఆర్ఓబీని అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
క్రైమ్ అనాలసిస్ జిల్లా ఇంచార్జ్శ్రీనివాస్ అప్పికొండ