దళిత గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కి వినతి పత్రం..

దళిత గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కి వినతి పత్రం..

07/August/2026 18:21    Share:   

అచ్చుతాపురం మండల పరిధిలోని దళిత గ్రామాల్లో సర్వేలు నిర్వహించి వెలుగులోకి వచ్చిన సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ సంఘాల నాయకులు బుధవారం తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులు భోగాపురం, మడుతురు, పూడి ఆర్ అండ్ ఆర్ కాలనీ, పూడిమడక గ్రామాల్లో మంచినీరు సక్రమంగా అందడం లేదని, సైడ్ కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. హరిపాలెం గ్రామంలో చేతిబోరు బాగుచేయాలని, పెదపాడులో ఉన్న సీలింగ్ భూములను దళితులకు పంచాలని వారు కోరారు.
అంతేకాకుండా పూడి, మార్టూరు గ్రామాల్లో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్. రాము, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రీ అప్పారావు, మత్స్యకార్మిక సంఘం నాయకులు చేపల తాతయ్యలు, గంట్యాడ చంటి, మైలుపల్లి శ్రీను, నడుపూరు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. వినతి పత్రం స్వీకరించిన తహసిల్దార్ సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
Breaking News

Subscribe our Newsletter