"తల్లికి వందనం"పథకం.ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ హర్షం...

"తల్లికి వందనం"పథకం.ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ హర్షం...

25/July/2026 10:04    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు.
మున్సిపల్ కార్మికులకు అందిన "తల్లికి వందనం"పథకం.ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ హర్షం...

ఏలూరు: తల్లికి వందనం పథకం మున్సిపల్ కార్మికులకు కూడా వర్తింప చేయడం పట్ల ఏపి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి)ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందని ద్రాక్షగా మారిన తరుణంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ దశల వారి పోరాటాలకు పిలుపు ఇచ్చి ఆ పోరాటాలను జయప్రదంగా నిర్వహించడంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిందన్నారు.
పోరాటాల ద్వారా మన డిమాండ్లు సాధించవచ్చు అని మున్సిపల్ కార్మికులు మరోసారి రుజువు చేశారని తెలిపారు.మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం, కోసం న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దశల వారి పోరాటాల్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్  విజయం సాధించిందన్నారు.కార్మికులందరూ ఈ విజయం ఇచ్చిన ఉత్తేజంతో భవిష్యత్తులో జరిగే పోరాటాలలో మరింత ఉత్సాహంగా పాల్గొని తద్వారా మన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు యూనియన్ ఇచ్చే ప్రతి పిలుపును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Breaking News

Subscribe our Newsletter