యలమంచిలి | రాంబిల్లి మండలం
మురకాడ,కట్టుబోలు గ్రామాలలో ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు, ప్రతి రైతు సేవ కేంద్ర పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయ అధికారి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ
1.ప్రతి రైతు యొక్క వ్యవసాయ భూ కమతాలను సందర్శించి పంటలు సాగు/ఖాళీ గా ఉన్నదా? సాగులో ఉంటే నీటి లభ్యత వివరాలు, చీడ పీడల ఉధృతి మొదలైన వాటిని ఏప్ లో నమోదు చేస్తారు. 2.క్షేత్రస్థాయిలో గుర్తించిన కరువు పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే ఇవ్వవలసిన ప్రాణాధార నీటి తడులు ,మల్చింగ్, అంతర పంటల సాగు, అవసరమైతే ప్రత్యామ్నాయ పంటలైన రాగి,గంటి,కందులు,పశుగ్రాస విత్తనాల కొరకు ప్రణాళిక సిధ్ధం చేయడం.
3.ఏపీ ఏఐఎంఎస్ 2.0 ద్వారా పారదర్శకంగా ఎరువుల పంపిణీని పర్యవేక్షించడం.
4.ఫార్మర్ యాప్ ద్వారా రైతులు అవసరమైన సలహాలు సూచనలు అందజేయడం
5. ప్రకృతి వ్యవసాయం లో విత్తన గుళికల తయారీ
పై విషయాల గురించి రైతుల కు అవగాహన కలిగించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి సుమంత తెలియజేశారు.ఈ కార్య క్రమంలో జ్యోతి, మేఘన, ప్రకృతి వ్యవసాయ అధికారులు కనక రత్నం, హేమ వ్యవసాయ విస్తరణ అధికారి దేవుడు, రైతు సోదరులు పాల్గొన్నారు.