
అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి డివిజన్, అచ్చుతాపురం మండలం, హరిపాలెం యూనిట్ పరిధిలోని అందలా పల్లి గ్రామంలో జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ (DPM) Ch. లచ్చన్న గారి ఆధ్వర్యంలో రైతులు, మహిళా రైతులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఎల్ నినో ప్రభావం, రసాయన వ్యవసాయం వల్ల కలిగే నష్టాలు, మరియు ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాలు గురించి DPM లచ్చన్న గారు రైతులకు వివరించి చెప్పారు.
అలాగే ప్రతి మంగళ, బుధవారాలలో నిర్వహించే "రైతే రాజు - రైతన్న మేలుకో" కార్యక్రమం గురించి రైతులందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మరింత సమగ్రమైన సమాచారం అందించే ప్రయత్నం జరుగుతుంది.
BRC సెంటర్ గురించి వివరణ: BRC పాయింట్ పర్సన్ పాత్ర, BRC సెంటర్లో లభించే కాషాయాలు, ద్రావణాలు, గ్రోత్ ప్రమోటర్ల గురించి కూడా వివరించారు. అలాగే ప్రకృతి వ్యవసాయంలో పాటించాల్సిన S2S (Seed to Soil) పద్ధతుల గురించి వివరంగా తెలియజేశారు.
డ్రై ప్యాడీలో అనుబంధ పంటల ప్రాముఖ్యత: రైతులకు డ్రై ప్యాడీలో పెసర, మినుములు, పిల్లి పెసర, కందులు, గోంగూర, తోటకూర వంటి అనుబంధ పంటలు వేస్తే కలుపు నివారణ తగ్గుతుందని, అలాగే వర్షాలు ఎక్కువైతే ఆ పంటలు కుళ్లి ఎరువుగా మారి ప్రధాన పంట వరి దిగుబడి బాగా వస్తుందని DPM సార్ వివరించారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ గోవింద్ గారు, MT వెంకట్ గారు, మార్కెటింగ్ MT శివ గారు, డివిజన్ MT వెంకటలక్ష్మి గారు, ICRP దేవి తదితరులు పాల్గొన్నారు.