పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం: యలమంచిలి ఏఎంసీ చైర్మన్ తట్టా లోవ కుమారి హెచ్చరిక

పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం: యలమంచిలి ఏఎంసీ చైర్మన్ తట్టా లోవ కుమారి హెచ్చరిక

05/April/2026 06:47    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి :
యలమంచిలి నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పరిధిలో పన్ను వసూళ్లపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏఎంసీ చైర్మన్ తట్టా లోవ కుమారి సూచించారు.అచ్చుతాపురం వైపు వెళ్తున్న బియ్యం లోడ్ వాహనాన్ని అధికారులు ఆపి బిల్లులు పరిశీలించగా, సరైన పన్ను చెల్లించకుండా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత వ్యాపారుల నుండి తక్షణమే పన్ను వసూలు చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ లోవ కుమారి మాట్లాడుతూ, పన్ను వసూళ్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, అవసరమైతే ఉన్నతాధికారులతో సంప్రదించి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.అలాగే, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేసే వ్యాపారులు తప్పనిసరిగా సెస్ చెల్లించి చట్టబద్ధంగా వ్యాపారం నిర్వహించాలని సూచించారు. పన్ను ఎగ్గొట్టే ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Breaking News

Subscribe our Newsletter