వై.లోవ గ్రామంలో పోలీసుల ప్రత్యేక భద్రతా చర్యలు: పొంగల్ వేడుకల కోసం సీసీ కెమెరాల ఏర్పాటు

వై.లోవ గ్రామంలో పోలీసుల ప్రత్యేక భద్రతా చర్యలు: పొంగల్ వేడుకల కోసం సీసీ కెమెరాల ఏర్పాటు

06/August/2026 20:16    Share:   

రాంబిల్లి:
వై.లోవ గ్రామంలో శాంతిభద్రతలు మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఈరోజు పరవాడ ఎస్‌డీపీవో గారు మరియు రాంబిల్లి పోలీస్ స్టేషన్ అధికారి వై.లోవ గ్రామాన్ని సందర్శించారు. రానున్న పొంగల్ వేడుకలను పురస్కరించుకుని, కార్యక్రమ ప్రదేశంలో నిరంతర నిఘా కోసం మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అనంతరం పోలీసు అధికారులు గ్రామస్థులతో మమేకమై మాట్లాడారు. పొంగల్ వేడుకలను అందరూ ప్రశాంత వాతావరణంలో, సంతోషంగా నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.

 
Breaking News

Subscribe our Newsletter