లైనకొత్తూరు గ్రామపంచాయతీకి "టీబీ" రహిత ప్రాంతం గుర్తింపు..
08/October/2026 19:55
Share:
CA న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
యలమంచిలి మండలంలోని లైనకొత్తూరు గ్రామపంచాయతీ టీబీ ఫ్రీ బ్లాక్‌గా ఎంపికైంది. 2030 నాటికి దేశం నుంచి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఈ గుర్తింపు లభించింది.
ఈ సందర్భంగా యలమంచిలి ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. లైనకొత్తూరు గ్రామపంచాయతీ టీబీ రహిత ప్రాంతంగా ఎంపికైనందుకు ఎంపీడీవో, రేగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రావణి, ఏఓ శ్రీనివాసరావు చేతుల మీదుగా అవార్డు అందజేశారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఒక్క టీబీ కేసు కూడా లేకుండా చేయడమే లక్ష్యంగా అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో డీవై ఎంపీడీవో అనంతనాగు, పంచాయతీ కార్యదర్శి గిరిప్రసాద్, టీబీ సూపర్వైజర్ సత్యనారాయణ, రాధిక, ఎంఎల్‌హెచ్‌పీ ఝాన్సీరాణి, ఏఎన్ఎం కుమారి, ఆశా కార్యకర్తలు లక్ష్మీ, రమణకుమారి పాల్గొన్నారు.