పూడిమడక,పూడి ఆర్ అండ్ ఆర్ దళితపేటలో సమస్యలు పరిష్కరించాలి, ప్రజా సంఘాలు.
06/August/2026 19:52
Share:
రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై వివక్షత, సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంఘాలు సర్వేలకు పిలుపునిచ్చాయి. పూడిమడక ,పూడి ఆర్ అండ్ ఆర్ గ్రామాల్లో, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కే సోము నాయుడు, మత్స్య కార్మిక సంఘం నాయకులు చేపల తాతయ్య పర్యటన చేయడం జరిగింది. గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై దళితులు వివరించడం జరిగింది. పూడిమడక కాలనీలో మంచినీటి కొళాయిలు నాలుగు రోజులకు ఒకసారి వస్తున్నాయని, వీధి కాలువలు లేవని, దోమలు విపరీతంగా ఉన్నాయని, ఉప్పు గల్లీలకు వచ్చే సముద్రపు నీరు పరిశ్రమల వ్యర్ధాలు వలన కాలుష్యం అయిందని ఉప్పుటేరుపై వంతెన నిర్మించడంతో గల్లీలకు సముద్రపు నీరు రావడంలేదని దీనివలన 52 కుటుంబాలు ఉప్పు పంటకు దూరమయ్యామని, పూడి ఆర్ అండ్ ఆర్ కాలనీలో స్కూల్ , దళిత పేటకు ఆనుకొని స్మశాన వాటిక ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ స్మశాన స్థలాన్ని వేరే చోటకి తరలించాలని ,సంవత్సరం నుండి మంచినీరు కుళాయిలు రావడం లేదని, వీధిలైట్లు వెలగడం లేదని మేజర్ సన్స్ కు ఇంటి స్థలాలు ఇవ్వలేదని, భూములు, ఇల్లు కోల్పోయిన దళితలకు ఏసియన్ పెయింట్ లో పనులు కల్పించలేదని దీంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని , పింఛన్లు, మంజూరు చేయాలని ,ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు గ్రామాలకు ఖర్చు చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఇరుగుల రాము, రాజు, సింహాద్రి ,ఈ చంటి, ఎం గణేష్ ,డేవిడ్రాజు తదితరులు పాల్గొన్నారు.