మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా కట్టా ఆది,నూతన కార్యవర్గం నియామకం..

మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా కట్టా ఆది,నూతన కార్యవర్గం నియామకం..

05/August/2026 20:05    Share:   

* మెగా యూత్ ఫోర్స్ కు నూతన కార్యవర్గం నియామకం..
* రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా కట్టా ఆది, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధిగా రామిశెట్టి కళ్యాణ్, ఏలూరు నగర కన్వీనర్ గా దేవాబత్తుల అరవింద్ నియామకం..
* ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో సత్కరించిన రెడ్డి అప్పలనాయుడు గారు..
* మెగా కుటుంబానికి మరింత మంచి పేరు తీసుకురావడంతో పాటు సమాజంలో మెగా అభిమానుల గౌరవాన్ని ప్రతిష్ఠను మరింత పెంచే విధంగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆకాంక్ష..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళె ఉద్దేశ్యం తో మెగా యూత్ ఫోర్స్ ను చిరంజీవి గారి కుమార్తె కొణిదల సుష్మిత గారు ఏర్పాటు చేశారు. ఈ యూత్ ఫోర్స్ నూతన కార్యవర్గం లో ఏలూరుకు చెందిన జనసేన నాయకులు ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధిగా రామిశెట్టి కళ్యాణ్, రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా కట్టా ఆది, ఏలూరు నగర కన్వీనర్ గా దేవబత్తుల అరవింద్ లను నియమించారు. ఈ నియామకం పట్ల ఏలూరుకు  చెందిన పలువురు జనసేన నాయకులు, మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఏలూరు జనసేన కార్యాలయంలో ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం చేశారు. శాలువాతో సత్కరించి, పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మెగా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, సినిమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాల్లో చురుకుగా తమ అభిమానాన్ని, సేవా భావాన్ని చాటుకుంటున్న మెగా అభిమానులు అందరికీ అభినందనలు తెలిపారు. ఇటీవల స్టేట్ వైడ్ గా మెగా యూత్ ఫోర్స్ టీమును చిరంజీవి గారి కుమార్తె  సుస్మిత కొణిదెల గారి ఆధ్వర్యంలో తీయడం జరిగిందన్నారు. దానికి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కట్టా ఆది, జిల్లా అధికార ప్రతినిధిగా రామిశెట్టి కళ్యాణ్, ఏలూరు నగర కన్వీనర్ గా దేవబత్తుల అరవింద్ లను ఈ యొక్క కమిటీలో నియమించారు. వారి ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్కు గాని లేదా సమాజానికి ఉపయోగ పడే విధంగా సేవా కార్యక్రమాలను చేయడం, సమాజంలో యూత్ ని ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా కార్యక్రమాలను తీసుకోవడమే చిరంజీవి గారి లక్ష్యం. వారి స్ఫూర్తితోనే అభిమానులు బ్లడ్ క్యాంపులు గాని, నేత్రదానం గాని అనేక విధాల సేవలను యూత్ నుంచి ఆకర్షించే విధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు తమ విలువైన సేవలను అందిస్తున్నారు. దానికి అనుసంధానంగానే ఈ రోజున మెగా యూత్ ఫోర్స్ స్టేట్ వైడ్ గా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఏలూరుకు చెందిన మెగా అభిమానులు, జనసేన నాయకులు రామిశెట్టి కళ్యాణ్, కట్టా ఆది, దేవబత్తుల అరవింద్ లను నియమించినందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగా అభిమానులందరికీ అభినందనలు తెలిపారు. ఏలూరు నుండి నియమితులైన ఈ ముగ్గురు యాక్టివ్ గా పనిచేసి, ప్రజల్లో ఒక చైతన్యవంతమైన సేవ వైపు, సేవ మార్గం వైపు, సమాజానికి మేలు కలిగే విధంగా వీరు పనిచేయాలని ఆశిస్తూ, వారికి ఏలూరు జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. మెగా కుటుంబానికి మరింత మంచి పేరు తీసుకురావడంతో పాటు, సమాజంలో మెగా అభిమానుల గౌరవాన్ని, ప్రతిష్ఠను మరింత పెంచే విధంగా వీరు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter