ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన..

ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన..

04/August/2026 19:39    Share:   

* జిల్లా సమీక్షా సమావేశానికి హాజరు..
* ఘన స్వాగతం పలికిన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు గారు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు, ఏలూరు జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జిల్లా సమీక్షా సమావేశం నిమిత్తం మంగళవారం ఏలూరుకు విచ్చేశారు.. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయనకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు.. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై  నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి అధికారులతో చర్చించారు.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేసే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిసింది.. స్వాగతం పలికిన వారిలో జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి కె.వెట్రి సెల్వి గారు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పట్సమట్ల ధర్మరాజు గారు, దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, రాష్ట్ర వడ్డీల కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి గారు, జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న) గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నారా శేషు గారు, మరియు పలువురు ఉన్నతాధికారులు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు ఉన్నారు..
Breaking News

Subscribe our Newsletter