ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మధ్యవర్తిత్వం 3.0

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మధ్యవర్తిత్వం 3.0

04/August/2026 19:30    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎస్.శ్రీదేవి,  ఆగస్టు 01వ తేదీ నుండి అక్టోబరు 31వ తేదీ వరకు నిర్వహించే మధ్యవర్తిత్వము 3.0 ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒక వారం రోజులు పాటు నిర్వహించే అవగాహన సదస్సులు నిర్వహణ నిమిత్తం, సోమవారం జిల్లా న్యాయ సేవాధికారసంస్థ భవనం నుండి ర్యాలీ నిర్వహించారు. 
ఈ సందర్భంగా  ఉమ్మడిజిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయ శ్రీమతి ఎస్..శ్రీదేవి మాట్లాడుతూ గత సంవత్సరము 1.O  మరియు 2.O లలో కేసులు పరిష్కారానికి విశేష కృషి జరిగిందని, ఆ యొక్క స్పెషల్ క్యాంపైయిన్లో అనుకున్న పురోగతిని సాధించడం వల్ల ఈ 3.O కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ యొక్క అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు. రాజీ యోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్, కుటుంబ వివాదాలు, బ్యాంకు లావాదేవీలు, వాహన ప్రమాద బీమా కేసులు, చిట్  ఫండ్ కేసులలో ఇరుపక్షాలకు మధ్యవర్తిత్వం నిర్వహించి, సానుకూల వాతావరణంలో సామరస్య పరిష్కారాన్ని కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటలు వరకు అన్ని కోర్టులు పరిధిలో శిక్షణ పొందిన మధ్యవర్తులు ద్వారా  ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాన కక్షిధారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసులు నుండి విముక్తి పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీమతి యు.ఇందిరా ప్రియదర్శిని, 7వ అదనపు జిల్లా జడ్జి వైస్.శ్రీనివాసరావు, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాస మూర్తి, పర్మినెంటు లోక్ అదాలత్  చైర్పర్సన్ శ్రీమతి ఏ.మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి, భార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కోనె సీతారాం, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, ప్యానల్ లాయర్లు, సిబ్బంది పోలీసు అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter