"మొక్కలు నాటితేనే మనుగడకు భరోసా"గ్రీన్‌క్లబ్ కార్యదర్శి శ్రీ కాండ్రేగుల సత్యనారాయణ..

"మొక్కలు నాటితేనే మనుగడకు భరోసా"గ్రీన్‌క్లబ్ కార్యదర్శి శ్రీ కాండ్రేగుల సత్యనారాయణ..

02/August/2026 17:23    Share:   

గ్రీన్‌క్లబ్, అనకాపల్లి వారి ఆధ్వర్యంలో మునగపాక మండలంలో గల "నాగవరం చెరువు" ఒడ్డున "బాదం", "వేప", "కానుగ", "పనస"మొదలగు 50 మొక్కలను నాటడమైనది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్‌క్లబ్ ఆధ్వర్యంలో నాగవరం చెరువు ప్రాంతంలో వృక్షారోపణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడమైనది. ఈ సందర్భంగా గ్రీన్‌క్లబ్ కార్యదర్శి శ్రీ కాండ్రేగుల సత్యనారాయణగారు (S.F.I), అనకాపల్లి భోగిలింగేశ్వర దేవస్థానం ఛైర్మన్ గారు మాట్లాడుతూ "పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలని, ఈరోజు నాటిన మొక్క రేపటి జీవన రక్షకుడు అని, ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొక్క, ప్రతి ఒక్కరి మనసులో పర్యావరణ చైతన్యం, ఈ ఆశయం గ్రీన్‌క్లబ్ పిలుపు" అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య సంరక్షణ అసిస్టెంట్ ఫారెస్ట్ ఆఫీసర్, వృక్షమిత్ర కోరాడ హరి-భూషణ్ శ్రీధర్ గారు మాట్లాడుతూ "చెట్లు పెరిగితేనే చెరువులు నిలుస్తాయి అని, మొక్కలు నాటితేనే భావితరాలకు రక్షణ మరియు పచ్చదనమే ప్రగతికి ప్రతీక అని, భావితరాల కోసం ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకోవాలని, చెరువులు చుట్టూ మొక్కలు పెంపకం వలన భూగర్భ జలాలు పెరగడం, నెలకు కోత తగ్గడం, పక్షులు మరియు ఇతర జీవులకు సహజ ఆవాసాలు ఏర్పడటం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని" కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ "ఒక వ్యక్తి - ఒక మొక్క, ప్రతి మొక్క - ఒక ప్రాణం" అను సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేయడంమైనది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రకృతి ప్రేమికులు, నాగవరం గ్రామ కూటమి నాయకులు, అడారి ప్రసాద్, యలమంచిలి బంగారు రాజుగారు, శ్రీమతి రాట్నాల అనిత, కర్రి నూకరాజు గారు, భానుమతి గారు, నయిశెట్టి సత్తిబాబు, పేరూరి చిన్నబ్బాయి, పెంటకోట సురేష్ కుమార్ గారు, యల్లపు సంతోష్ కుమార్ గారు మరియు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొనడంమైనది. పలువురు గ్రామ ప్రజలు గ్రీన్‌క్లబ్ సేవలను అభినందించడం విశేషం.
Breaking News

Subscribe our Newsletter