డైట్ రూరల్  అవుట్ రీచ్ ప్రోగ్రాం ( “డి ఆర్ ఓ పి “ )  డైట్ గ్రామీణ సామజిక విస్తరణ కార్యక్రమం

డైట్ రూరల్  అవుట్ రీచ్ ప్రోగ్రాం ( “డి ఆర్ ఓ పి “ )  డైట్ గ్రామీణ సామజిక విస్తరణ కార్యక్రమం

26/July/2026 10:07    Share:   

డైట్ గ్రామీణ సామాజిక విస్తరణ కార్యక్రమం భాగంగా రామపురం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు దాడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆటోనమస్‌ను సందర్శించారు. అనంతరం కళాశాల అడ్మిషన్స్ ఇన్‌ఛార్జ్  షబీనా గారు కళాశాలలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, పాలిటెక్నిక్ విద్యార్థులకు లభించే అడ్మిషన్ అవకాశాలు, ప్లేస్‌మెంట్ సౌకర్యాలు, ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులకు సమగ్రంగా వివరించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.  ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాలలోని వివిధ విభాగాలు, కంప్యూటర్ ల్యాబ్, కమ్యూనికేషన్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, సివిల్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ల్యాబ్ తదితర ప్రయోగశాలలను సందర్శించే అవకాశం కల్పించారు.   డాక్టర్ .కే .ఎస్ ఈశ్వర రావు గారు ,డీన్ (అడ్మినిస్ట్రేషన్) మరియు వివిధ విభాగాధిపతులు విద్యార్థులతో ఆత్మీయంగా సంభాషించి, కళాశాల విశేషాలు, విద్యా అవకాశాలు మరియు కెరీర్ మార్గదర్శకత్వంపై అవగాహన కల్పించారు.
అనంతరం చైర్మన్ శ్రీ దాడీ రత్నాకర్ గారు  విద్యార్థులతో కలిసి మధ్యాహ్న ఆహారం స్వీకరించి, వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ ఉన్నత విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. వారి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు. కళాశాల క్యాంపస్‌లోని ఇతర సౌకర్యాలను కూడా విద్యార్థులకు చూపించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వివిధ క్రీడా పోటీలు నిర్వహించగా, విజేతలకు అభినందనలు తెలియజేసారు . విద్యార్ధులకు పెన్ లు , జామెంట్రీ బాక్స్ లను అందజేసారు. స్కూల్ విద్యార్ధులు ,అధ్యాపకులు మా స్కూల్ విద్యార్ధులకు ఈ అవకాసం కల్పించినందుకు ఇన్స్టిట్యూట్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు జేలియజేసారు .
Breaking News

Subscribe our Newsletter