మహిళా ఎస్సై పై దౌర్జన్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి..

మహిళా ఎస్సై పై దౌర్జన్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి..

31/July/2026 21:08    Share:   

* నేరాలకు పాల్పడిన వారిని ప్రోత్సహించే పార్టీగా వైసీపి మారింది..
* విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐపై వైసీపీ నేతల దురుసు ప్రవర్తన..
* మహిళా ఎస్సై పై దౌర్జన్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి..
* ఆర్టీసీ జోన్ 2 చైర్మన్,  ఏలూరు జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు ఖండన..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
శ్రీకాకుళం జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి పర్యటన సందర్భంగా డ్యూటీలో ఉన్న మహిళా అధికారిణి (SI) ప్రవల్లిక గారి పట్ల వైసీపీ రౌడీ మూకలు, ఆముదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్ మరియు వాళ్ల అనుచరులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గమని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ మనిషి అనేవాడు ఎవరికైనా మంచి మానవత్వం ఉంటాయి.‌ రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే అయ్యో పాపం అంటాం. బాధితుడుకో, బాధిత కుటుంబానికో సహాయం చేస్తాం. అంతేకానీ రోడ్డున పోయేవాడు చనిపోయాడు, ఆయనకు వయసైపోయింది అని మాట్లాడిన ఈ జగన్ రెడ్డి నీ ఏమనాలి..?? అసలు ఈ జగన్ రెడ్డి కీ మతి స్థిమితం సరిగ్గా ఉందా..?? ప్రమాదంలో ఒక వ్యక్తిని చంపేసిన నేరస్థుడికి మద్దతుగా వెళతాడా..?? నేరాలకు పాల్పడిన వారిని ప్రోత్సహించే పార్టీగా వైసీపి మారింది. బీసీలన్నా, ఎస్సీ, ఎస్టీలన్నా జగన్ రెడ్డి కీ చిన్న చూపు. మహిళా అధికారిణిపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తిస్తే జగన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు‌.‌.?? గంజాయి బ్యాచ్ లకు , క్రిమినల్స్ కు, ప్రమాదాలు చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీసేసే వ్యక్తులను మాత్రం పరామర్శలు చేస్తాడా.. ?? అని రెడ్డి అప్పలనాయుడు మండి పడ్డారు. చట్టాన్ని అమలు చేసే మహిళా పోలీసు అధికారిణి ప్రవల్లిక గారిపై అనుచితంగా ప్రవర్తించడం వైసీపీ నాయకుల సంస్కారహీనతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అధికారం కోల్పోయినా వైసీపీ నాయకుల్లో అహంకారం తగ్గలేదని, మహిళల పట్ల గౌరవం లేకపోవడానికి ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. మహిళల భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోని చట్టప్రకారం శిక్షించాలన్నారు.
Breaking News

Subscribe our Newsletter