బ్రాండ్ఎక్స్ కార్మికులకు వేతనాలు పెంపుకై జూలై 30న కలెక్టరేట్ ధర్నాకు తరలి రండి. సీఐటీయూ
25/July/2026 18:54
Share:
బ్రాండ్ ఎక్స్ కార్మికులకు కనీస వేతనం జీవోను సవరించి జీతాలు పెంచాలని, పనిబారం తగ్గించాలని ఈనెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో బ్రాండిక్స్ కార్మికులంత పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులను కలిసి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కె సోము నాయుడు మాట్లాడుతూ బ్రాండ్ ఎక్స్ ఇండియా అపరిల్ సిటీలో ఉన్న పరిశ్రమల్లో కార్మికులు 15 ఏళ్లగా ప్రభుత్వాల అండతో యాజమాన్యాలు కార్మికుల శ్రమనుదోచుకుంటున్నాయని, 2011లో పరిశ్రమల్లో వేతనాలు సవరణ చేసి ఆ తర్వాత 2016,20 21,2026 లో అంటే మూడుసార్లుగా 15 సంవత్సరాలైనా వేతనాల పెంపు జీవో ఇవ్వలేదు. టెక్స్ టైల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన జీవో పెంచుతూ జీవో వెంటనే ఇవ్వాలని ఈనెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వేతనాల పెంపకై ధర్నా నిర్వహిస్తున్నట్లు ఈ ధర్నాలో కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని గత 15 సంవత్సరాలలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కుటమి ప్రభుత్వాలు వేతనాలు పెంచకుండా కార్మికులందరికీ నష్టం చేశారు. ప్రభుత్వ విధానాల వలన విద్య, వైద్యం ,గ్యాస్, పెట్రోల్ ,కరెంట్ చార్జీలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. జీతాలు మాత్రం పాతాళానికి తొక్క వేయబడుతున్నాయన్నారు వెంటనే వేతనాలు పెంపుదాలకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.కార్మికుల వేతనాలు పెంచాలని ఈనెల 30న ధర్నా జరుగుతుందని ఈ ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.