కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు, జూలై , 31 : జిల్లాలోని రైతులందరూ పంటల భీమా పధకం లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్ లో పాత్రికేయులతో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వ్యవసాయ భూమి కలిగిన రైతులు, కౌలుదారులు ఈ పధకానికి అర్హులని, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, భూమి పాస్ బుక్ నకళ్ళు, పంటవేసినట్లు ధృవీకరించిన ధ్రువీకరణ పత్రం లేదా స్వీయ ధ్రువీకరణ ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతా, భూ వివరాలు మరియు ఇతర అవసరమైన పత్రాలతో సమీప కామన్ సర్వీస్/ పంటల భీమా పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా/ పంటల భీమా యాప్/ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ప్రతినిధి ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. మినుములు పంటకు ఎకరాకు 300 రూపాయలు చొప్పున,పత్తి పంటకు 1900 చొప్పున, నిమ్మ పంటకు 2500 రూపాయలు చొప్పున జులై, 31వ తేదీలోగా రైతులు చెల్లించాలని, అదేవిధంగా వరి పంటకు ఎకరాకు 840 రూపాయలు చొప్పున ప్రీమియం ను ఆగష్టు , 15వ తేదీ లోగా చెల్లించి నమోదు కావాలన్నారు. గ్రామస్థాయిలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు శుక్రవారం రైతులకు అందుబాటులో ఉంటారన్నారు. రుణ అర్హత కార్డులు కలిగిన కౌలు రైతులు కూడా భీమా పధకంలో అర్హులన్నారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న రైతులు, కౌలు రైతల నుండి బ్యాంకర్లు రుణాల నుండి ప్రీమియం ను వసూలు చేస్తారన్నారు.రుణాలు తీసుకొని రైతులు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా, భూ వివరాలు మరియు ఇతర అవసరమైన పత్రాలతో సమీప కామన్ సర్వీస్/ పంటల భీమా పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా/ పంటల భీమా యాప్/ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ప్రతినిధి ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో సూపర్ ఎల్నినో పరిస్థితుల కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉండవచ్చునని, కావున రైతులందరూ పంటల భీమా పధకంలో తప్పనిసరిగా నమోదుకావాలని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ప్రభృతులు పాల్గొన్నారు.