సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థి సంఘాలు,ప్రవేశంపై ఆంక్షలు ప్రజాస్వామ్య విరుద్ధం ఎస్‌ఎఫ్‌ఐ
31/July/2026 16:50
Share:
యలమంచిలి/సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థి సంఘాల నాయకులు మరియు పత్రికా విలేకరులు ప్రవేశించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎస్‌ఎఫ్‌ఐ ఎలమంచిలి డివిజన్ కమిటీ సభ్యులు భాను దేవుడు తీవ్రంగా ఖండించారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి విద్యార్థి సంఘాలు, అలాగే వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయడానికి పత్రికా విలేకరులు కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి వారిపై ప్రవేశ ఆంక్షలు విధించడం పారదర్శకతను దెబ్బతీయడమే కాకుండా, విద్యార్థుల సమస్యలను మరుగునపరచే ప్రయత్నంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తే ఇలాంటి ఆంక్షలు అవసరం ఉండవని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.