కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, ఆగష్టు - 15...
ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితమే నేడు మనం పీల్చుతున్న స్వేచ్ఛా వాయువులని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరుల స్ఫూర్తితో సమాజ రక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఏలూరు అమీనాపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి, టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం మువ్వన్నెల పతాకాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. అనంతరం విద్యార్ధులకు పుస్తకాలను, మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. అనేక మంది మహనీయులు ఈ దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు సలిపారని చెప్పారు. మరెన్నో త్యాగాలు చేశారంటూ కొనియాడారు. అంతటి ఘన చరిత్రను ప్రతిఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం, బాధ్యతను ఆయన గుర్తుచేశారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగ స్ఫూర్తితో ప్రజలంతా ప్రస్తుతం సమాజ రక్షణ కోసం పాటుపడాలంటూ బడేటి చంటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, టీడీపీ జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పలువురు మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జిలు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు...