సురక్షిత బాల్యమే సురక్షిత భవిష్యత్తు  సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి విజయ ..

సురక్షిత బాల్యమే సురక్షిత భవిష్యత్తు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి విజయ ..

30/July/2026 18:59    Share:   

మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూనియర్ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు
తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం ఫోటోలు లేదా పత్రాలు పంచుకోవద్దు 

మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో న్యాయ శాస్త్ర అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి విజయ గారు, ప్రిన్సిపల్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు కళాశాల విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

విద్యార్థులకు మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించి, వారిని అప్రమత్తం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా మాట్లాడిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి విజయ గారు మాట్లాడుతూ, "తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం, ఫోటోలు లేదా పత్రాలు పంచుకోవద్దు. ఎవరైనా బలవంతంగా పనిచేయించడం, భయపెట్టడం లేదా నిర్బంధించడం మానవ అక్రమ రవాణాలో భాగం కావచ్చు" అని హెచ్చరించారు.

అప్రమత్తత, అవగాహన మరియు ధైర్యంగా ఫిర్యాదు చేయడం ద్వారా మానవ అక్రమ రవాణాను అరికట్టవచ్చని న్యాయమూర్తి వివరించారు. ఆమె మాట్లాడుతూ, "సురక్షిత బాల్యమే సురక్షిత భవిష్యత్తు. ప్రతి విద్యార్థి ఈ సందేశాన్ని గుర్తించుకోవాలి. మానవ అక్రమ రవాణాను అరికడదాం, మనుషులను కాపాడదాం. అప్రమత్తతే రక్షణ, అవగాహనే ఆయుధం. ప్రతి విద్యార్థి సురక్షితంగా ఉంటేనే సమాజం సురక్షితం" అని నొక్కిచెప్పారు.ఈ కార్యక్రమంలో లోకదాలత్ మెంబర్ బి. వెంకటరావుగారు, ప్యానల్ లాయర్ బి. హరి శంకర్ రావుగారు, కళాశాల సిబ్బంది, కోటి సిబ్బంది తదితరులు పాల్గొని విద్యార్థులకు చట్టపరమైన అవగాహన కల్పించారు.

Breaking News

Subscribe our Newsletter