కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, నవజాత శిశువు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అలాగే బిడ్డ తల్లిపై పేపర్లు విసిరి అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన బాధిత కుటుంబానికి వివరించారు. ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి విభాగంలో నవజాత శిశువు మృతిచెందిన ఘటన గురువారం రాత్రి ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఘటన వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యాధికారులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. అలాగే బాధిత కుటుంబంతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి వారి నుండి పలు వివరాలు తెలుసుకుని, వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ లింగపాలెం మండలం అయ్యప్పరాజు గూడానికి చెందిన స్వీటి అనే గర్భిణి స్త్రీ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి వార్డులో చేరి మూడు రోజులైనా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత హార్ట్‌బీట్ తక్కువగా ఉండి నవజాత శిశువు చనిపోయిందని చెప్పడం వైద్యులు, ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరేనని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చంటి,,, ఘటనపై సమగ్ర విచారణ జరిపాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ని ఆదేశించినట్లు చెప్పారు. ఇదేఅంశంపై డిఎంఎ సెక్రటేరియట్‌కు కూడా సమాచారం అందించామన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామంటూ ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు నాయుడు సోము,RNR నాగేశ్వరరావు, లంకపల్లి మాణిక్యాలరావు, గొంగాడి సాంబశివరావు, గొంగాడి బోసు,డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, 2టౌన్ సిఐ అశోక్ కుమార్, పలువురు కూటమి పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు...