ఏలూరు నగరంలో నేటి నుంచి యథావిధిగా రెండు పూటలా తాగునీటి సరఫరా
29/July/2026 19:40
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఏలూరు నగరంలో నేటి నుంచి యథావిధిగా రెండు పూటలా తాగునీటి సరఫరా పునరుద్ధరణ చేశామని కమిషనర్ అన్నప్రగడ భాను ప్రతాప్ తెలిపారు.ఏలూరు నగర ప్రజలకు తాగునీటి సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని,నేటి (మంగళవారం) నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు యథావిధిగా ఉదయం,సాయంత్రం రెండు పూటలా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్నప్రగడ భాను ప్రతాప్ తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి స్టోరేజ్ ట్యాంక్‌లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో నగర ప్రజలకు నాలుగు రోజుల పాటు రోజుకు ఒక పూట మాత్రమే తాగునీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.అయితే,గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా స్టోరేజ్ ట్యాంక్‌లో నీటి నిల్వలు పెరగడంతో పరిస్థితిని సమీక్షించి,ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మరియు మేయర్ శ్రీమతి నూర్జహాన్ సూచనల మేరకు నగర ప్రజలకు నేటి నుంచి పూర్తి స్థాయిలో రెండు పూటలా తాగునీటి సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు.ప్రజలందరూ తాగునీటిని అవసరానికి మాత్రమే వినియోగించాలని,నీటిని వృథా చేయకుండా బాధ్యతాయుతంగా ఉపయోగించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు సహకరిస్తే భవిష్యత్తులో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా తాగునీటిని అందించగలమని ఆయన పేర్కొన్నారు.ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నగర ప్రజలకు నిరంతరాయంగా,నాణ్యమైన తాగునీటి సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను కొనసాగిస్తుందని కమిషనర్ తెలిపారు.