వికసిత్ భారత్-స్వర్ణ ఆంద్రప్రదేశ్ అమలు చైర్మన్ లంకా దినకర్,
28/July/2026 20:46
Share:
స్వీకరించిన ప్రతి అర్జీని శాశ్వత పరిష్కారం చూపి ప్రజలు సంతృప్తిని స్థాయిని మరింత పెంచాలి. ఇరవై సూత్రాల కార్యక్రమం ( వికసిత్ భారత్-స్వర్ణ ఆంద్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్, ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు . కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఏలూరు, జూలై 28: స్థానిక రెవెన్యూ అతిథిగృహంలో మంగళవారం ఒక్కరోజు జిల్లా పర్యటనకు వచ్చిన ఇరవై సూత్రాల కార్యక్రమం (వికసిత్ భారత్-స్వర్ణ ఆంద్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్ ను, వివిధ రాజకీయ పార్టీలు ప్రముఖులు, కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు. తదనంతరం గోదావరీ సమావేశ మందిరంలో సమీక్షసమావేశం అనంతరం ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు. శ్రీయుత చైర్మన్ తో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, డా.కామినేని శ్రీనివాస్, సొంగా రోషన్ కుమార్, ఏపి వడ్డి కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి యం.శ్రీదేవి, జిల్లా అటవీశాఖ అధికారి పి.వి.సంధీఫ్ రెడ్డి లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇరవై సూత్రాల కార్యక్రమం (వికసిత్ భారత్-స్వర్ణ ఆంద్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు గ్రామాలకు, ప్రతిగడపకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడవలసిన బాధ్యత అధికారులుపై ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమసమస్యలను, ఇబ్బందులు ధైర్యంగా, నిర్భయంగా చెప్పుకోవచ్చునని అన్నారు. ప్రజలు సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి అర్జీని క్షుణంగా అధ్యయనం చేసి, అవసరం అయితే క్షేత్రస్థాయిలో అర్జీదాలను స్వయంగా కలుసుకుని నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. సమావేశంలో జెడ్పీ సిఈవో పి.జగదాంబ, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.