దెందులూరు వాటర్ ట్యాంకును వైసీపీ నేతలు సందర్శించి పరిశీలన..

దెందులూరు వాటర్ ట్యాంకును వైసీపీ నేతలు సందర్శించి పరిశీలన..

28/July/2026 20:40    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
ఏలూరు:
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (JP) గారి నేతృత్వంలో పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్, మాజీ ప్రజాప్రతినిధులు దెందులూరు లోని వాటర్ ట్యాంకును సందర్శించారు. మీడియా ప్రతినిధులు, ట్యాంకు అధికారులు సమక్షంలో వారు అక్కడ పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన మామిళ్ళపల్లి జయప్రకాష్ (JP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా 5 నుండి 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా చెరువులో నీళ్లు నింపలేదని ఆయన మండిపడ్డారు. భారీ మొత్తంలో నిధులు వ్యయం చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని, ప్రజలకు సరైన సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వాళ్లు చేసిన తప్పులు ప్రజలకి కనబడేటట్టు చేశారని వాటిని డైవర్ట్ చేయడానికి ఆదివారం కూటమీ నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి ఏదో బటన్ నొక్కారు. ఆదివారం మోటార్ ఆగిపోయింది, శనివారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ట్యాంక్ వద్దకు వచ్చి కరెంట్ ట్రాన్స్ఫారం ను పాడు చేశారు అని కల్పిత కథతో సమావేశం ఏర్పాటు చేయడమైనది.ఈ విషయాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అక్కడ అధికారుల సమక్షంలో పంపుల చెరువు పరిశీలించడమైనదని, బటన్ నొక్కారు మోటర్ పోవడం అనే కారణం చెప్పడం కూడా వింతగా ఉంది, ఈ అధికారులు 5-6 కోట్లు ఖర్చు దేనికి అయిందో దాని కోసం మాట్లాడవలసింది. ఎక్కడైనా బటన్ నొక్కితే మోటర్లు, బేరింగులు పోతాయా ఇటువంటి  అసత్య ఆరోపణలు ఆపి ప్రజలకు రెండు పూటలా ఏ విధంగా మంచినీరు అందించాలని దానిమీద పనిచేస్తే బాగుంటుందని, ఇప్పుడు ఈ పేరు చెప్పి ఎన్ని లక్షల బిల్లులు పెడతారు అని ఖండించిన గుడిదేశి శ్రీనివాస్ గారు, నూకపెయ్యి సుధీర్ బాబు గారు, తుమరాడ స్రవంతి గారు, మున్నుల జాన్ గుర్నాథ్ గారు, జిజ్జువరపు విజయ నిర్మల గారు, ఈ కార్యక్రమంలో నేరుసు చిరంజీవి గారు, దాసరి రమేష్ గారు,లంకలపల్లి గణేష్ గారు, ఇనపనూరు జగదీష్ గారు, జైకర్ గారు,భాస్కర్ల బాచి గారు, కొల్లిపాక సురేష్ గారు, సదానంద్ గారు, బోగిశెట్టి పార్వతి గారు, సాయి గారు, ఉమామహేశ్వరరావు గారు, పసుపులేటి దినేష్ గారు, రాజేష్ గారు, బండ్లమూడి సునీల్ గారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter