చిన్న బంటుపిల్లి, అక్టోబర్ విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం చిన్న బంటుపిల్లి గ్రామంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికల కార్యక్రమం నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ కోట్ల వెంకటరావు, మాజీ సర్పంచ్ బూరె నరేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు.కార్యకర్తలకు అండగా ఉంటా.. ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా: చిన్న శ్రీనుస్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా సమష్టిగా పనిచేయాలి స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు, టీడీపీ అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.ఎస్.ఆర్. రామ్ మల్లిక్ నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ తనను నమ్మి పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి నాయకుడిని, కార్యకర్తను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేర్కొంటూ, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటానని తెలిపారు.నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యత, సమన్వయం మరింత బలోపేతం కావాలని, ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మెరకముడిదాం మండలంలో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.