
ప్రపంచ పర్యావరణ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని మన్యపాలెం ట్రైబల్ ఏరియా అవేర్నెస్ క్యాంపు నిర్వహించడం జరిగినది దీనికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జెడ్ శ్రీమతి జి స్పందన గారు మరియు ఫారెస్ట్ ఆఫీసర్ గారు బి వి రమణ బార్ ప్రెసిడెంట్ పివి రమణ గారు, లోక్ అదాలత్ మెంబర్ డి వెంకట్రావు గారు ప్యానల్ లైయర్స్ బి హరి శంకర్ రావు గారు టి నూకరాజు గారు పిఎల్ డి సురేష్ ఎస్ నాగేశ్వరరావు ఆ వూరు ప్రెసిడెంట్ ఎం చిన్న తదితరులు పాల్గొన్నారు దినోత్సవం పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్ తీసుకున్న కీలకమైన అడుగుగా నిలిచింది.
అటవీ భూముల రక్షణ: ఈ చట్టం ప్రకారం అటవీ భూములను ఇతర అవసరాలకు మార్చకుండా కఠినంగా నియంత్రిస్తుంది. అడవులను నరికి వేతను నియంత్రించి అటవీ సంపదను కాపాడటం ఇందులో ప్రధాన ఉద్దేశం.
కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి: అటవీ ప్రాంతాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేయబడింది. ఎలాంటి అభివృద్ధి పనులకైనా అటవీ భూములను వినియోగించాలంటే కేంద్రం ఆమోదం పొందడం తప్పనిసరి.
నష్టపరిహార నిబంధన: పర్యావరణానికి నష్టం కలిగించిన సందర్భాల్లో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని చట్టం స్పష్టం చేస్తుంది.
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నిపుణులు ఇచ్చిన పిలుపు:
పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వం ఒక్కటే చేయగలిగింది కాదు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించి ప్రకృతిని కాపాడాలని, చెట్లను నాటాలని, నీటిని ఆదా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ఈ దిశగా ఒక బలమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.