మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత..

మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత..

27/July/2026 20:14    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, 
ప్రజల ఆకాంక్షల మేరకు మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. దానిలో భాగంగానే ప్రాధాన్యతాక్రమంలో రహదారుల నిర్మాణాన్ని ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. ఏలూరు 17వ డివిజన్‌ నందిగం వారి సందులో సాప్ట్‌లోన్‌ నిధులు 14లక్షల, 90వేల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు, డ్రైయిన్‌ నిర్మాణ పనులకు టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సోమవారం శంకుస్థాపన చేశారు. తొలుత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం కూటమి నాయకులు, స్థానికులతో కలిసి ఎమ్మెల్యే చంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ డివిజన్‌ల వారీగా ప్రాధాన్యతాక్రమంలో రహదారులను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామన్నారు. దానిలో భాగంగానే స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 17వ డివిజన్‌లోని గాంధీధ్యాన మందిర్‌ రోడ్డును కూడా అభివృద్ధి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. ఈ రోడ్డును అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని నిర్ణయించి, కాంట్రాక్టర్‌కు కూడా ఆ దిశగా కీలక సూచనలు చేశామని చెప్పారు. అలాగే ఇక్కడి రహదారిని 60అడుగుల మేర అభివృద్ధి చేసే క్రమంలో తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు కూడా అందరితో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని ఆయన స్థానికుల్లో భరోసా నింపారు. కాగా,,, ఎన్నో ఏళ్ళ కలగా ఉన్న ఈ రోడ్డు నిర్మాణం విషయంలో స్థానికుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని దాన్ని సఫలీకృతం చేయడంతో ప్రజలంతా ఎమ్మెల్యే బడేటి చంటికి సంతోషాలతో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, ఏఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, బిజెపి అధ్యక్షులు గాదె రాంబాబు, కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, కార్పొరేటర్ పాము పద్మశామ్యల్ టిడిపి డివిజన్‌ ఇన్‌ఛార్జి వీరంకి త్రినాథ్‌, కో ఇన్ఛార్జ్ జన్యావుల అంజిబాబు, నాయకులు ఎమ్మార్డీ బలరాం, ఆర్‌ఎన్‌ఆర్‌ నాగేశ్వరరావు, వీరమాచనేని చందు, రాళ్లపల్లి రవి, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, జనసేన డివిజన్ ఇంచార్జ్ లక్కింశెట్టి కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్శి కస్తూరి తేజస్విని, తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter