ఎసెన్సియా అడ్వాన్సుడ్ సైన్సెస్ ఫార్మా మృతులకు నివాళి, సిఐటియు

ఎసెన్సియా అడ్వాన్సుడ్ సైన్సెస్ ఫార్మా మృతులకు నివాళి, సిఐటియు

21/August/2026 21:01    Share:   

కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ (CA NEWS ప్రతినిధి)

అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ లోని ఎసెన్సియా అడ్వాన్సుడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా పరిశ్రమ లో 21 ఆగస్టు 2024 న జరిగిన విషాద ప్రమాదం జరిగి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అచ్చుతాపురం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు అధ్యక్షతన అచ్చుతాపురం జంక్షన్ లో నివాళి అర్పిస్తూ సంతాప సభ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు, జిల్లా కార్యదర్శి ఆర్. రాము మాట్లాడుతూ
2 సంవత్సరాల క్రితం యాజమాన్య నిర్లక్ష్యం వల్ల 17 మంది కార్మికులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. 36 మంది తీవ్ర గాయాల పాలయ్యారు
ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు సగంలోనే ఆగిపోయాయి. హైలెవల్ విచారణ రిపోర్ట్ బయట పెట్టలేదని, నిందితులపై చర్యలు తీసుకోలేదని  ఎస్ ఈ జెడ్  లో సేఫ్టీ ఆడిట్లు పేపరు పైనే ఉన్నాయని ఎస్ ఈ జెడ్ అన్ని ఫార్మా పరిశ్రమల్లో లోని ప్రతి కంపెనీలో ప్రమాదాలు జరగకుండా ప్రతి ఆరు నెలలకు భద్రత ఆడిట్  లు నిర్వహించి నివేదికలు బయట పెట్టాలని 
ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని
ఆగస్టు 21 ను పారిశ్రామిక భద్రతా దినంగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు  రాజాన సత్తిబాబు, మైలపల్లి రమణ ఆటో యూనియన్ నాయకులు కాకి రాజు, ఎస్ మోహన్, బి ఆనంద్, కె సన్యాసి నాయుడు, ఎల్ రాము నాయుడు,  శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter