"రెక్కలు తొడుక్కుంటున్న ఉత్తరాంధ్ర"ఏటికొప్పాకలో రంగవల్లితో సందేశం..

"రెక్కలు తొడుక్కుంటున్న ఉత్తరాంధ్ర"ఏటికొప్పాకలో రంగవల్లితో సందేశం..

27/July/2026 20:12    Share:   

అనకాపల్లి జిల్లా, (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ఉత్తరాంధ్రకు రెక్కలు వచ్చాయి’ కార్యక్రమం ఏటికొప్పాకలో నిర్వహించారు.
బండిమాంబ గుడి ఆవరణలో వెలుగు సిబ్బంది ఏపీఎం రాణి ఆధ్వర్యంలో రంగులతో అందమైన ముగ్గు వేసి, అందులో ‘ఉత్తరాంధ్రకు రెక్కలు వచ్చాయి’ అని రంగులతో రాసి కార్యక్రమాన్ని నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాకతో ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, వ్యాపారాలు, పర్యాటకం అభివృద్ధి చెంది యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అన్నం బాబ్జి, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, వెలుగు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter