శాకంబరి వాసవీమాత దర్శనం - ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమం
26/July/2026 18:22
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి.ఏలూరు శాకంబరిగా వాసవీమాత దర్శనం,ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఎమ్మెల్యే చంటి
ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఏలూరు పెరుగు చెట్టు సెంటర్‌లోని వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలో వాసవీమాతను శాకంబరి దేవి రూపంలో వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించారు. ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, ఆయన సతీమణి మీనా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ : ప్రజలందరికీ వాసవీమాత ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన వాసవీమాతను శాకంబరి రూపంలో అలంకరించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.