అచ్చుతాపురం లో విద్యాసంస్థల బందు విజయవంతం, ప్రజా సంఘాలు
24/July/2026 19:36
Share:
నీట్ ప్రశ్న పత్రాల లీక్ వ్యవహారంపై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని విద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బందుకు పిలుపునిచ్చాయి అందులో భాగంగా అచ్చుతాపురంలో విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బందు పాటించాయి అనంతరం ర్యాలీ మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు జి కోటేశ్వరరావు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు డివైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు కె సోమునాయుడు మాట్లాడుతూ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు సమస్యను పరిష్కరించకుండా ఢిల్లీ పోలీసులు నిరాహార దీక్షను భగ్నం చేయడం విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దుర్మార్గం అని ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన రైతు ప్రజా సంఘాలు, అభ్యుదయ వాదులు బందుకు పిలుపునిచ్చాయి . అందులో భాగంగా కార్మికులు, విద్యార్థులు అచ్యుతాపురంలో బంద్ పాటించడం జరిగిందని నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పేపర్ లీక్ విషయంలో విద్యార్థులు మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని వీరి కుటుంబాలకి న్యాయం చేయాలని ఆమరణ దీక్ష చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు సరి కదా సమస్యను జటిలం చేస్తున్నది శాంతియుత ఆమరణ దీక్ష చేస్తున్న సమస్యను పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో కె ఉమాశంకర్ ఆర్ హేమంత్, ఎం సాకత్ నాయుడు, కె రాహుల్ మధు విద్యార్థులు పాల్గొన్నారు.