ఏటికొప్పాకలో రైతులకు యూరియా పంపిణీ.. వ్యవసాయానికి అండగా ప్రజాప్రతినిధులు..!

ఏటికొప్పాకలో రైతులకు యూరియా పంపిణీ.. వ్యవసాయానికి అండగా ప్రజాప్రతినిధులు..!

21/July/2026 21:27    Share:   

అనకాపల్లి జిల్లా,(క్రైమ్ఎనాలసిస్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా రైతులకు సకాలంలో యూరియా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. రైతులు ఎరువులను సక్రమంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రం సిబ్బంది కుమార్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శెన్నాంశెట్టి శ్రీను, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, వైస్ ఎంపీపీ నాగిరెడ్డి అచ్చయ్య నాయుడు, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, రైతు సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి సత్యనారాయణ, దారా పోలిశెట్టి, దారా నూకరాజు, ఇందల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన పలువురు రైతులు హాజరై యూరియాను స్వీకరించారు
Breaking News

Subscribe our Newsletter