కస్తూర్బా పాఠశాలలో విషపురుగులు, పాములు నివారణకు చర్యలు చేపట్టాలి, సిపిఎం
18/July/2026 21:42
Share:
అచ్చుతాపురం కస్తూర్బా పాఠశాలలో పాములు సంచరిస్తున్నాయని విద్యార్థులు నిత్యం భయాందోళనలకు గురవుతున్నారు వీటిని నివారించి విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని ఈరోజు అచ్చుతాపురం కస్తూర్బా పాఠశాలలో సిపిఎం, విద్యార్థనుల తల్లిదండ్రులు పర్యటించడం జరిగింది ,ఈ సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము మాట్లాడుతూ గతంలో పాముకాటుతో విద్యార్థిని మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారని , అప్పుడప్పుడు పాములు కనబడుతున్నాయని విద్యార్థులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు పాఠశాల ప్రదేశంలో సిమెంటు, ఇటుకలు ఇతర డిబ్రిన్ వంటివి నిండి ఉన్నాయి వీటిని శుభ్రం చేసి పాఠశాలలో ప్రశాంత వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కోవిరి కోదండ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.