అనకాపల్లి,
వినాయక చవితి సందర్భంగా శారదా నది పరివాహక ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని పలువురు కోరారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.శారదా నది పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ లైటింగ్, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నిమజ్జన సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నదిలో కాలుష్యం పెరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ