విజయనగరం వైసీపీ మేయర్ అభ్యర్థిగా కోలగట్ల స్రావణి..

విజయనగరం వైసీపీ మేయర్ అభ్యర్థిగా కోలగట్ల స్రావణి..

16/October/2026 19:36    Share:   

విజయనగరం
విజయనగరం మేయర్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరఫున కోలగట్ల స్రావణిని మేయర్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. రానున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఆమె పోటీ చేయనున్నారు.మేయర్ స్థానం అన్‌రిజర్వ్‌డ్ మహిళకు కేటాయించడంతో వైసీపీ కోలగట్ల స్రావణిని అభ్యర్థిగా ఖరారు చేసింది. గతంలో ఆమె విజయనగరం కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా, డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
వైసీపీ అధిష్ఠానం గురువారం ప్రకటించిన 27 పట్టణ స్థానిక సంస్థల అభ్యర్థుల జాబితాలో విజయనగరం మేయర్ అభ్యర్థిగా స్రావణి పేరు అధికారికంగా ప్రకటిచడంతో  విజయనగరం మేయర్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Breaking News

Subscribe our Newsletter