ఎంపీపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ పదం కార్యక్రమం..!

ఎంపీపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ పదం కార్యక్రమం..!

27/May/2026 16:03    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివి సూర్య ప్రకాష్ :
 
స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలంలోని లైన్ కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ సిబ్బంది, క్లాప్ మిత్రులు కలిసి లైన్ కొత్తూరు ఆర్ & బి రోడ్డు నుండి పంచాయతీ పరిధిలోని అన్ని వీధి రోడ్ల ఇరువైపులా పెరిగిన కలుపు మొక్కలు, చెత్త కుప్పలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యలమంచిలి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రాజాన సూర్య చంద్ర శేష గిరి రావు హాజరయ్యారు. అలాగే పంచాయతీ ప్రత్యేక అధికారి కె. శ్రీనివాస రావు, పంచాయతీ అభివృద్ధి అధికారి మరియు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. అధికారులు గ్రామ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.
Breaking News

Subscribe our Newsletter