పంచదార్ల గ్రామంలో అభ్యుదయ రైతులతో వ్యవసాయ శాఖ శిక్షణా కార్యక్రమం
18/July/2026 21:27
Share:
రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో అభ్యుదయ రైతులతో వ్యవసాయ శాఖ- ఆత్మ - ఎలమంచిలి డివిజన్ - అనకాపల్లి జిల్లా- విశాఖపట్నంవారి సౌజన్యంతో శిక్షణా కార్యక్రమం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం-ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థా నం ,అనకాపల్లి నుండి డాక్టర్ ఎం రవిబాబు, సీనియర్ శాస్త్రవేత్త సమీకృత పోషక యాజమాన్యం పైన మొక్కల శరీర ధర్మ శాస్త్రం మరియు పంటల పెరుగుదల లో స్ధూల పోషకాలు,సూక్ష్మపోషకాల పాత్ర మరియు లక్షణాలను బట్టి లోపాలను గుర్తించి వాటిని సవరించే పద్ధతులను రైతులకు పవర్ పాయింట్ ద్వారా ప్రదర్శించారు.అదేవిధంగా ఫాస్ఫరస్,పొటాషియం జీవన ఎరువులను వినియోగించే విధానాన్ని అనకాపల్లి జిల్లావనరుల కేంద్రం,ఏ.ఓ. విజేత తెలిపారు.వరి సాగు చేసే రైతులందరు వాతావరణ ఆధారిత పంటలభీమా పధకం (WBCIS)లో ఎకరానికి రూ.84/- ఇన్సూరెన్స్ చేసుకుంటే రూ.42492/- భీమా మొత్తం వస్తుందని మండల వ్యవసాయ అధికారి, ఇన్ చార్జి ఏడిఏ సుమంత తెలియజేశారు.ఈ కార్య క్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లోవ కుమారి,దిన్ బాబు,యం.పి.ఇ.ఓ.-రామారావు, ఏఈవో, విఏఏలు,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.