హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు శనగపప్పు పంపిణీ..!
30/March/2026 07:27
Share:
చోడమాంబిక పండగ సందర్భంగా హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు శనగపప్పు పంపిణీ..! క్రైమ్ అనాల్సిస్ టివిఎస్ ప్రకాష్, యలమంచిలి : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం రామన్నపాలెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ చోడమాంబిక అమ్మవారి పండగ సందర్భంగా హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు శనగపప్పు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు పాల్గొని, హెరిటేజ్ డైరీకి పాలు సరఫరా చేస్తున్న 63 మంది పాడి రైతులకు ఒక్కొక్కరికి 2 కేజీల చొప్పున శనగపప్పు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మేనేజర్ కూండ్రపు శేషు రైతులతో మాట్లాడుతూ, పాడి రైతుల సంక్షేమం కోసం హెరిటేజ్ డైరీ తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.రైతులు కూడా మాట్లాడుతూ, హెరిటేజ్ డైరీ నుంచి తమకు నిరంతరం సహాయం అందుతోందని, ఇలాంటి కార్యక్రమాలు తమకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ధర్మరెడ్డి కిషోర్, దరిమిరెడ్డి రాము, రెడ్డి చిన్న రాము, డి. అప్పలనాయుడు, డి. రాము, డి. లక్ష్మి, డి. సత్యం, డి. సన్నీ బాబు, పి. రామునాయుడు, పి. నర్సింగరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.