దిమిలి గ్రామంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం
28/July/2026 20:26
Share:
యలమంచిలి/రాంబిల్లి/ దిమిలి గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గంటి,మొక్కజొన్న పీఎండిఎస్ , వరి నారుమడులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. చిరుధాన్యలు,వరి, నారుమడి యాజమాన్యంపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. వరి సాగు చేస్తున్న రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన- పునర్వవస్ధీకరించిన వాతావరణ ఆధారిత పంటల భీమా పథకంలో ఎకరానికి రూ.84/- ప్రీమియం చెల్లించి ప్రకృతి వైపరీత్యాల వలన పంట పూర్తిగా నష్టపోయినప్పుడు ఎకరానికి రూ.42000/- వచ్చే అవకాశం ఉన్నందున ఆగష్టు 15 వ తేదీ లోగా భీమా చేసుకోవాలని సూచించారు. తర్వాత స్థానిక మీసేవ కేంద్రాన్ని పరిశీలించి పంట భీమా చేసుకున్న రైతులకు భీమా పత్రాలు అందజేశారు. రైతులు ఆధార్ కార్డు,భూమి పాస్ బుక్ -1బి,స్వీయ ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పుస్తకం,ఆధార్ తో లింక్ ఉన్న ఫోన్ తో మీ సేవ కేంద్రాల లో ప్రీమియం చెల్లించవలసినదిగా మండల వ్యవసాయ అధికారి సి.సుమంత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవుడు,వి.ఎ.ఎ.రాజ్ కుమార్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రత్నం,కనక రత్నం, అభ్యుదయ రైతు గంటా. ముని ,రైతులు పాల్గొన్నారు.