"తక్కువ పెట్టుబడితో"నూతన వ్యవసాయ విధానంలో అధిక దిగుబడులు..
17/July/2026 20:07
Share:
ఎలమంచిలి మండలం సోమలింగపాలెం గ్రామంలో రైతులను ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు మాట్లాడుతూ నూతన వ్యవసాయ విధానం అభివృద్ధికి పాడిపంటలు అధిక సోపానం,నూతన వ్యవసాయ విధానంలో అధిక దిగుబడులు తక్కువ పెట్టుబడితో సాధించాలంటే వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తల పర్యవేక్షణమే కాకుండా పాడిపంటలు ప్రోచురింపబడిన వ్యాసాలు అనుసరించి రైతులు పాటించినట్లయితే క్రిమిసంహారిక మందులను వీడి ప్రకృతి వ్యవసాయం మీదుగా వాణిజ్య పంటలను సిఫారసు మేరకు వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చునని తెలియజేశారు పాడిపంటలు బుక్కులలో ఒక సంవత్సరానికి 300 రూపాయలు చందా వ్యవసాయ శాఖ అధికారి వారి ద్వారా కట్టినట్లయితే నెలకి ఒక బుక్కు చొప్పున సంవత్సరానికి 12 బుక్కులు ఇవ్వడం జరుగుతుందని సీజన్కి అనుకూలంగా పంటలలో వచ్చినటువంటి అధిక వంగడాలతో పాటు యాజమాన్య పద్ధతుల గురించి అలాగే, అభ్యుదయ రైతులు వారి యొక్క సక్సెస్ స్టోరీలను కూడా ప్రచారంపడతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కర్రి ఝాన్సీ , ఎల్లపు శ్రీనివాసరావు పాండూరు శ్రీనివాసరావు ,హరినాథ్ రైతులు మరియు వ్యవసాయ సహాయకులు మోహన్ భాస్కర్, లోకేష్ పాల్గొన్నారు