రూ. 35 లక్షలతో శేషుకొండ లేఅవుట్‌లో ప్రారంభమైన సీసీ రోడ్ల నిర్మాణం
11/July/2026 21:07
Share:
యలమంచిలి పురపాలక సంఘం పరిధిలోని శేషుకొండ లేఅవుట్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీఎంఆర్‌డీఏ నిధుల నుండి మంజూరైన మొత్తం రూ. 35 లక్షల వ్యయంతో పురపాలక సంఘం ఈ పనులను చేపడుతోంది. ఇందులో భాగంగా రూ. 20 లక్షలతో లేఅవుట్‌లోని ఫ్లాట్ నంబర్ 65 నుండి 80 వరకు, అలాగే మరో రూ. 15 లక్షలతో ఫ్లాట్ నంబర్ 1 నుండి 18 వరకు సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. ఈ పనుల ప్రారంభ కార్యక్రమంలో ఏఈ నానాజీ, అధికారులు, కూటమి నాయకులు, కాలనీ వాసులు లోవ తాతారావు, నాని, గాంధీ, శ్రీను, లోవరాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.