నేషనల్ స్పోర్ట్స్ డే 2026 -27   పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్

నేషనల్ స్పోర్ట్స్ డే 2026 -27 పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్

09/July/2026 20:47    Share:   

సీనియర్ జర్నలిస్ట్ గంటా గోవింద్

అనకాపల్లి జూలై 9: నేషనల్ స్పోర్ట్స్ డే 2026-27 లో భాగంగా అమరావతి ఛాంపియన్షిప్-2026కు సంబంధించి పోస్టర్ ను గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్ తో కలసి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆవిష్కరించారు.*
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందులో 17 ఏళ్ల లోపు మరియు 23 ఏళ్ల లోపు (బాలురు & బాలికల) విభాగాలకు సంబంధించి, ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్ బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో, వెయిట్లిఫ్టింగ్, వాలీబాల్ మరియు యోగా వంటి 12 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించబడతాయన్నారు. ఈ పోటీలు నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో జూలై 15 నుండి ఆగస్టు 29 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ క్రీడలలో జిల్లా యంత్రాగం, విద్యాలయాల క్రీడాకారులు మరియు యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.*
జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిణి పూజారి శైలజ మాట్లాడుతూ, ఈ పోటీలలో పాల్గొనదలచిన వారు తప్పనిసరిగా రాష్ట్ర క్రీడా ప్రాధికర సంస్థ (SAAP) వెబ్ సైట్ నందు వారి యొక్క ఆదార్ కార్డ్ ద్వారా రిజిస్టర్ అవ్వాలని తెలిపారు.*
Breaking News

Subscribe our Newsletter