డప్పు,చర్మకారులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు వెంటనే విడుదల చెయ్యాలి..
09/July/2026 19:17
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు #డప్పు కళాకారులకు, చర్మకారులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు వెంటనే విడుదల చేయాలి #దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ డిమాండ్ ఏలూరు జిల్లా ఏలూరు నగరం ఫిల్ హౌస్ పేట బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద దళిత సేన ఏలూరు జిల్లా ఇన్చార్జి గుంటూరు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు, చర్మకారులకు సంక్షేమ పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అర్హులైన డప్పు కళాకారులకు, చర్మకారులకు లెదర్ వర్క్ చేసే కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసే ప్రత్యేక సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీరియొక్క ఆర్థిక జీవన ప్రమాణాలను కాపాడుటకు తక్షణమే డప్పుకళాకారులకు, చర్మకారులకు పెన్షన్లు విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ఏలూరు నగర దళిత సేన ఉపాధ్యక్షులు పొలిమేర రాజు ఏలూరు నగర ప్రధానకార్యదర్శి బేతపూడి నవీన్ కుమార్ కార్యదర్శి పోలిమెట్ల పండు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ డిమాండ్