2047 వికసిత్ భారత్‌ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం..

2047 వికసిత్ భారత్‌ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం..

11/August/2026 21:07    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, 
జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరు నుండి మంగళవారం "2047 వికసిత్ భారత్‌ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరి ఆలోచనలు, సూచనలు అందజేసి భాగస్వాములు కావాలి" అనే అంశంపై జిల్లా, మండల వివిధ శాఖలు అధికారులతో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేను అనే కార్యక్రమం ద్వారా  తమ ఆలోచనలు, సూచనలు సంక్షిప్తంగా కొద్ది సెకన్ల వీడియో రూపంలో తెలియజేసి, నిర్దేశించిన విధంగా అప్లోడ్ చెయ్యాలని అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు, వికసిత్ భారత్‌ నిర్మాణంలో ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు ఆలోచనలు, సూచనలను భాగస్వామ్యం  కావాలని పిలుపునిచ్చారు. నేను అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా జాతియస్ఫూర్తితో లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. అన్ని శాఖలు అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు, పాఠశాలలు, కళాశాలలు విద్యార్థిని, విద్యార్థులు నేను అనే కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలు నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రజలు ఆలోచనలు, సృజనాత్మక సూచనలు భవిష్యత్తు భారత నిర్మాణానికి దోహదపడతాయని  పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలంటే ప్రజల్లో దేశభక్తి, బాధ్యతాయుత పౌరస్ఫూర్తి, అభివృద్ధి పట్ల నిబద్ధత మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశభక్తి భావన పెంపొందించేలా విద్యార్థులకు వ్యాసరచన,వకృత్వం చిత్రలేఖనం వంటి పోటీలను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ర్యాలీ నిర్వహించడం, సమావేశాలు నిర్వహించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చెయ్యాలని, నాటిన మొక్కలను సంరక్షించటం, ఆ మొక్కలకు నామకరణం చేసి ట్రీగార్డులు ఏర్పాటు కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.గూగుల్ మీట్ లో జిల్లా, డివిజన్, మండల వివిధ శాఖలు అధికారులు ఆయా కార్యాలయంలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter